భక్తి

 చక్కని తల్లికి ఛాంగుభళా 
అన్నమయ్య కీర్తన సేకరణ - నాగ సాయి లలిత లాస్య 






చక్కని తల్లికి ఛాంగుభళా తన
చక్కెర మోవికి ఛాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు చూపులకు ఛాంగుభళా
పలుకుల సొలపుల పతితో కసరెడి
చలముల యలుకకు ఛాంగుభళా 


కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెరుగులకు ఛాంగుభళా 
ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి ఛాంగుభళా 


జందెపు ముత్యపు సరుల హారముల
చందనగంధికి ఛాంగుభళా
విందయి వేంకటవిభు పెనచిన తన
సందిదండలకు ఛాంగుభళా  


జీవనశైలి -   లలిత లాస్య 
ఆరోగ్యమే మహా భాగ్యం - నాగ సాయి రమ్య 

చింతపండు పులిహోర -  నాగ సాయి రమ్య